ప్రకృతి

0
50
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

నువ్వు

నీ చుట్టూనే తిరగుతున్న ఒక వృత్తానివి

మౌన మునిలా కాసేపు – పైకి ముసుగేసుకుని మరి కాసేపు

ఒంటరిలో సమూహాపు –  సమూహంలో ఒంటరితనపు సంవేదన నువ్వు

ఏదో ఛేదిస్తూ సర్వం సాధిస్తున్నా అనుకునే నువ్వు..

నాతో వస్తావా?

 

నేను …

అంతులేని అంబరాన్ని – వేల మైళ్ళ సముద్ర తీరాన్ని

పచ్చిక బయలు నేను -పక్షి రాజము నేను

అర ఒంగిన కొబ్బరాకు ఇంపు నేను– తొంగి చూసే వెండి వెన్నెల నేను.

గల గల సెలయేటికి జతకట్టి వీచే సమీరం నేను

నువ్వు నాతో వస్తావా?

 

నేను…

నీచే కట్టబడిన, హంగులు అద్దబడిన అందాల పల్లెను

ఎన్నో కథనాల, మరెన్నో జీవితాల అల్లిబిల్లి సరాగమును

జీవనదిలా సాగిపోయే జనస్రవంతికి నేను సాక్షీభూతము

నన్ను చదువుతూ సాగిపోయేటందుకు

నువ్వు నాతో వస్తావా?

 

నేను..

నీకై వచ్చిన అమ్మ ఒడి వెచ్చదనం – ఆ చేతి కమ్మదనం

నేను నీ ధరిత్రి – నీ జీవన సహచరి

నాతొ పాటే నువ్వు – నీతో పాటే నేను

మనంగా సాగే నా లోకంలోకి

మరి నువ్వు నాతో వస్తావా?

 

 

 

 

నేను..

వెల్లువెత్తి  పొంగే గోదావరి – ఏరుగా పిల్లకాలువగా నిన్ను చుట్టే నీటి మత్తడి

గుడిగంటలై మ్రోగి – నీ స్వరనాడులను శ్రుతించే జీవన నాదాన్ని

బాటసారి బంధువును – నీ ఙాపకాల దొంతరను

నీ స్వేచ్చా విహంగపు గగనాన్ని – నీ పాదము మొహరించు మహిని

నా ఋణము తీరుస్తావా? నువ్వు నాతో వస్తావా?


 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here