హేమంతానికి ఓ ప్రేమలేఖ

0
113
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

శరత్ కాలపు చంద్రున్ని తనివి తీరగా చూడనైనా లేదు

నేనున్నా అంటూ వచ్చేసావా ప్రియ హేమంతమా?

ముసిగా నవ్వేస్తూ కసిగా నన్నుచలితో కొరికేస్తావే ?

భయపెడుతూ నా వెన్ను ఒణికిస్తావే?

 

అయినా…

పెదవి పగిలి నెత్తురోడుతున్నా నేను నిన్ను ముద్దాడుతూనే ఉన్నా

ఊచ ఒళ్ళు ఊగుతూ ఉన్నా నా ఉరకలు ఆపేయలేకున్నా

ఊలు రగ్గులో ఉండచుట్టుకుని ఉచ్చ్వాస నిశ్వాసలో నిన్ను నేను  నింపేసుకున్నా

తెల్లవారి వెలుగులో నీ పొగమంచు తెరని నేను కప్పేసుకున్నా

 

పోతూ పోతూ ఉంటే..

రివ్వున ఎగిరే నీలి పిట్ట ఆగి నన్ను చూసినట్లుంటే

గోలి కళ్ళ లేడి పిల్ల చెంగుమంటు ఓ బెదురు చూపు విసిరిపోతే

నిత్య హరిత వయ్యారంతో అలవోకగా ఊగుతూ ఉంటే

నీ చిత్రాన్ని నీవు సుతారంగా గీస్తూ పోయేవు ప్రియతమా

 

వస్తూ వస్తూ…

సంధె వేళకే కారుచీకటి కమ్మేస్తే, శీతలం నవనాడులని ఝుళిపిస్తే…

నేనెమైనా కసిరానా? నేనెపుడైనా విసిరానా?

పొడవాటి నా ఊలుకోటు, మోకాలు దాకా నా బూటు నే తెచ్చుకోనా?

మెడకు పూల మఫ్లరు, చేతికి వెచ్చటి తొడుగు చుట్టేసి నీకేసి చూసి నే నవ్వేయనా?

 

నీకేమో కోపం ఎక్కువ…

మోకాలు లోతు మంచు నా ముంగిట్లో పోసేస్తావు

అయినా మంచు ముద్దలుగా చేసి పసిపిల్లలా నేను ఆడేస్తాను

మంచులో లోతుగా అడుగేస్తూ ఆ గుర్తులు లెక్కేస్తూ

ఇది కరిగిపోయే హేమంతమేలే, ఆపై శిశిరం వచ్చేనులే అంటూ నేను సాగిపోయేను


 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
Previous articleప్రకృతి
Next articleCHILDHOOD
'We are humans first then anything next' is my concept of life. I don't look up at anyone and look down at anyone.  I always wonder, why no one stopped Hitler and if a person like Hitler would repeat in the present or future? I hold MBA in Finance. I am a Finanacial Systems Manager by profession and by passion, I like to promote equality, yoga, meditation, cancer awareness and drug awareness. Ethos of rape culture bothers me the most. I dream of a world where no one is left behind. Everyone should be entitled for basic previleges. Can this dream ever come true?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here